Saturday, January 18, 2025
Homeసినిమాకొరియర్ ద్వారా సోనూసూద్ ఆక్సిజన్ పంపిణీ

కొరియర్ ద్వారా సోనూసూద్ ఆక్సిజన్ పంపిణీ

గత ఏడాది నుంచి కరోనా వైరస్ తో ఎంతగానో ఇబ్బంది పడుతున్న పేద వారికి సోనూసూద్ నిర్విరామంగా సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. డబ్బును ఏ మాత్రం లెక్క చేయకుండా తన సొంత ఖర్చులతో ఆపదలో వున్నా వారికి చేయూత ఇస్తున్నారు. ఇక సెకండ్ వేవ్ లో సోనూసూద్ మరింతగా తన సేవా భావం ప్రదర్శిస్తున్నారు. మాట ఇచ్చినట్లుగానే  ఆక్సిజన్ ప్లాంట్స్ ను జెట్ స్పీడ్ లో నిర్మించి ఎంతోమందికి ఊపిరి పోస్తున్నాడు.

ఇక ఇప్పుడు మరొక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ సిలిండర్స్ కోసం దేశమంతా ఆర్తనాధాలు వినిపిస్తుండడంతో దేశంలో ఎక్కడికైనా ఆక్సిజన్ సిలిండర్ పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆక్సిజన్ అవసరం ఉన్నవారు www.umeedbysonusood.com కు లాగిన్ అవ్వాలని  కోరారు. డిటిడిసి ద్వారా అవసరమైన వారికి సిలిండర్ పంపుతామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్