Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్ఐపీఎల్: విమెన్ టి-20 విజేత సూపర్ నోవాస్

ఐపీఎల్: విమెన్ టి-20 విజేత సూపర్ నోవాస్

Novas-Winner: ఐపీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మై 11 (లెవన్) మహిళల టి 20 ఛాలెంజ్ కప్ ను హర్మన్ ప్రీత్ కౌర్ సారధ్యంలోని సూపర్ నోవాస్ గెల్చుకుంది. నేడు జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ లో వెలాసిటీపై సూపర్ నోవాస్ 4 పరుగులతో విజయం సాధించింది. లారా వోల్వార్ద్ట్- సిమ్రాన్ బహదూర్ లు అద్భుత బ్యాటింగ్ తో వెలాసిటీ జట్టును విజయం అంచుల వరకూ తీసుకెళ్ళారు. నోవాస్ బౌలర్ సోఫీ ఎక్సెల్ స్టోన్ వేసిన చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా, మొదటి బంతిని వోల్వార్ద్ట్ సిక్సర్ కొట్టింది, కానీ ఆ తర్వాతి బంతుల్లో 1,1,2,1, 1 పరుగులు మాత్రమే లభించడంతో నోవాస్ విజయం ఖాయమైంది.

పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో వెలాసిటీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నోవాస్ లో డీంద్ర దాట్టిన్-62; కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్-43, ప్రియా పునియా-28 పరుగులతో రాణించారు. మిగిలిన బ్యాట్స్ విమెన్ విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. వెలాసిటీ బౌలర్లలో లారా క్రాస్, సిమ్రాన్ బహదూర్ , దీప్తి శర్మ తలా రెండు; ఆయబొంగా ఖాక ఒక వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన వెలాసిటీ జట్టులో ఓపెనర్లు (షఫాలీ వర్మ-15; యాస్తిక భాటియా-13) తక్కువ స్కోరుకే అవుట్ కాగా, నవ్ గిరే-0, చాంతమ్-6, కెప్టెన్ దీప్తి శర్మ-2  విఫలమయ్యారు. ఈ దశలో వోల్వార్ద్ట్ 40 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో 65;  సిమ్రాన్ 10 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 20 పరుగులు చేసి అజేయంగా నిలిచినా చివరి ఓవర్లో విఫలం కావడంతో ఓటమి తప్పలేదు.

నోవాటెల్ బౌలర్లలో అలన కింగ్ మూడు; ఎక్సెల్ స్టోన్, దాట్టిన్ చెరో రెండు; పూజా వస్త్రాకర్ ఒక వికెట్ పడగొట్టారు.

ఆల్ రౌండ్ ప్రతిభ చూపిన దాట్టిన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ తో పాటు ‘ప్లేయర్ అఫ్ ద టోర్నమెంట్’ కూడా దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్