Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్బెంగుళూరులో వర్షం: సిరీస్ డ్రా

బెంగుళూరులో వర్షం: సిరీస్ డ్రా

Draw: ఇండియా- సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో విజేతను నిర్ణయించే ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. బెంగుళూరు చిన్న స్వామి స్టేడియంలో వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా ప్రోటీస్ కెప్టెన్ బావుమా వైదొలగడంతో కేశవ్ మహారాజ్ సారధ్య బాధ్యతలు చేపట్టాడు.

వర్షం కారణంగా మ్యాచ్ ను మొదటే 19 ఓవర్లకు కుదించి 50 నిమిషాలు ఆలస్యంగా మొదలు పెట్టారు. ఇండియా  మొదటి ఓవర్లోనే 16 పరుగులు రాబట్టి మంచి ఊపుమీదున్నట్లు కనిపించింది, ఐతే రెండో ఓవర్ చివరి బంతికి 15 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. నాలుగో ఓవర్ రెండో బంతికి రుతురాజ్ గైక్వాడ్ కూడా బౌల్డ్ అయి వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లూ నిగిడి కే లభిచాయి.  3.3  ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 28 పరుగుల వద్ద వర్షం మళ్ళీ అంతరాయం కలిగించింది. శ్రేయాస్ అయ్యర్ (0);  కెప్టెన్ పంత్ (1) క్రీజులో ఉన్నారు.

చిరుజల్లులు కొనసాగుతుండడంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఐదు మ్యాచ్ ల సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లూ సౌతాఫ్రికా గెల్చుకోగా, ఆ తర్వాత రెంటిలో ఇండియా విజయం సాధించింది. దీనితో సిరీస్ డ్రా అయ్యింది.

భువనేశ్వర్ కుమార్ కు ప్లేయర్ అఫ్ ద సిరీస్ లభించింది.

Also Read : నాలుగో మ్యాచ్ లో ఇండియా ఘన విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్