Sunday, January 19, 2025
Homeసినిమావెంకీ 75 వెనకున్న అసలు కథ ఇదే

వెంకీ 75 వెనకున్న అసలు కథ ఇదే

విక్టరీ వెంకటేష్ ఇటీవల దృశ్యం 2, నారప్ప, ఎఫ్ 3 సినిమాలతో సక్సెస్ సాధించారు. అయితే.. దృశ్యం 2, నారప్ప చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఎఫ్ 3 థియేటర్లో రిలీజ్ అయ్యింది. ఆతర్వాత చాలా కథలు విని ఆఖరికి శైలేష్ కొలనుతో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. ఈ మూవీకి సైంధవ్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీ అనౌన్స్ మెంట్ రోజునే గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో రఫ్ లుక్ లో కనిపించిన వెంకీ.. తనదైన స్టైల్ లో యాక్షన్ అండ్ డైలాగ్ తో అదరగొట్టేసారు. సినిమా పై అంచనాలు పెంచేశారు.

అయితే.. ఇది వెంకటేష్ 75వ చిత్రం. ఈ చిత్రాన్ని ఎప్పటి నుంచో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయాలి అనుకున్నారు. ఆయన కథ చెప్పడం.. నచ్చి వెంకీ, సురేష్ బాబు ఓకే చేయడం జరిగింది కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. ఇక త్రివిక్రమ్ వరుస బడా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోవడంతో మధ్యలో వెంకీ సినిమా వైపు చూడలేదు. దీంతో చాలా రోజులు త్రివిక్రమ్ కోసం చూసి కొందరు దర్శకులను లాక్ చేసుకున్నాడు వెంకీ. అందులో శైలేష్ కి 75 వ సినిమా తగిలింది. ఇక వెంకీ ఫ్యాన్స్ కూడా రెండు మూడేళ్ళ క్రితం వెంకటేష్ ల్యాండ్ మార్క్ సినిమా త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తాడని ఆశలు పెట్టుకున్నారు కానీ సెట్ కాకపోవడంతో డీలా పడ్డారు.

ఇప్పుడు శైలేష్ రిలీజ్ చేసిన ‘సైంధవ్’ గ్లిమ్స్ తో వెంకీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. కానీ ఎప్పటి నుండో వెంకీ , త్రివిక్రమ్ కాంబో కోసం చూస్తున్న వారి కోరిక మాత్రం తీరడం లేదు. ఏదేమైనా వెంకీ తన ప్రెస్టీజియస్ ల్యాండ్ మార్క్ మూవీను కుర్ర దర్శకుడి చేతిలో పెట్టడం గొప్ప విషయమే. వెంకీ, సురేష్‌ బాబులకు ఓ పట్టాన కథలు నచ్చవ్. ఎంత బాగా చెప్పినా ఇంకా ఏదో కావాలి అంటారు. అలా మార్పులు చేర్పులు చెబుతూనే ఉంటారు. మరి శైలేష్ మీద వెంకీకి ఎందుకంత నమ్మకమో ? బహుశా ఈ దర్శకుడు తీసిన హిట్ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ కావచ్చు అంటున్నారు సినీజనాలు. మరి.. వెంకీ నమ్మకాన్ని శైలేష్ నిజం చేస్తాడో లేదో చూడాలి.

Also Read : వెంకీ 75వ చిత్రం ‘సైంధవ్’

RELATED ARTICLES

Most Popular

న్యూస్