Saturday, January 18, 2025
HomeసినిమాKeerthy Suresh: చైతూ మూవీ కీర్తి సురేష్ మిస్ అవ్వడానికి కారణం ఇదే

Keerthy Suresh: చైతూ మూవీ కీర్తి సురేష్ మిస్ అవ్వడానికి కారణం ఇదే

అక్కినేని నాగచైతన్య, చందు మొండేటి కాంబినేషన్లో ఓ విభిన్న ప్రేమకథా చిత్రం తెరకెక్కనుంది. ఈ భారీ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే.. ఈ చిత్రంలో కథానాయిక సాయిపల్లవి లేదా కీర్తి సురేష్ అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. ఫైనల్ గా ఇప్పుడు ఈ సినిమాలో సాయిపల్లవి నటిస్తున్నట్టుగా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో కీర్తి సురేష్ ఈ ప్రాజెక్ట్ మిస్ చేసుకోవడానికి కారణం ఏంటి అనేది ఆసక్తిగా మారింది.

నాగచైతన్య, కీర్తి సురేష్ మహానటి సినిమాలో గెస్ట్ రోల్స్ చేశారు. ఇప్పటి వరకు జంటగా నటించలేదు కాబట్టి.. చైతన్య, కీర్తి సురేష్ కాంబో అయితే ఫ్రెష్ గా ఉంటుంది అనుకున్నారు. దాదాపుగా కీర్తి ఫైనల్ అనుకున్నారు. అయితే.. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు పర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉంది. పైగా కాస్త గ్లామర్ తక్కువుగా నేచురల్ గా కనిపించాలి. పైగా బిజినెస్ ప్రకారం ఆలోచించినా కీర్తి కంటే.. సాయిపల్లవి బెటర్ అని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. అందుకనే కీర్తి సురేష్ ను కాదనుకుని సాయిపల్లవిని ఫైనల్ చేశారని తెలిసింది.

నాగచైతన్య, సాయిపల్లవి కలిసి లవ్ స్టోరీ మూవీలో నటించారు. ఆ సినిమా సక్సెస్ అయ్యింది. ఈసారి కూడా ఈ కాంబో విజయం సాదించడం ఖాయమని టాక్ బలంగా వినిపిస్తుంది. చైతన్య మార్కెట్ కంటే ఎక్కువుగా బడ్జెట్ పెట్టి దాదాపు 60 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. హీరోయిన్ ఫిక్స్ అయ్యింది ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది కన్ ఫర్మ్ కావాలి. అనిరుథ్, ఎ.ఆర్.రెహమాన్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫిక్స్ అవుతారని టాక్ వినిపిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్