Sunday, February 23, 2025
Homeస్పోర్ట్స్నిఖత్ జరీన్ విజయంపై కేసిఆర్ హర్షం

నిఖత్ జరీన్ విజయంపై కేసిఆర్ హర్షం

CM KCR hailed: ప్రతిష్టాత్మక ‘ ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్’ పోటీల్లో 52 కిలోల విభాగంలో నిజామాబాద్ కు చెందిన నిఖత్ జరీన్ విశ్వ విజేతగా నిలవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. బంగారు పతకాన్ని సాధించిన జరీన్ కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. భారత కీర్తి పతాకాన్ని విశ్వ క్రీడావేదిక మీద ఎగరేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ ను సీఎం కేసిఆర్ మనస్ఫూర్తిగా అభినందించారు.

ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని నిఖత్ జరీన్ బాక్సింగ్ క్రీడలో విశ్వ విజేతగా నిలవడం గర్వించదగిన విషయమని సీఎం అన్నారు.
క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నదని,. తెలంగాణలోని ప్రతీ గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేసి, యువ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని సీఎం కేసిఆర్ ఈ సందర్భంగా తెలిపారు.

Also Read : చరిత్ర సృష్టించిన జరీన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్