Saturday, January 18, 2025
Homeసినిమాబాల‌య్య 'అన్ స్టాప‌బుల్-2' ఎప్పుడు?

బాల‌య్య ‘అన్ స్టాప‌బుల్-2’ ఎప్పుడు?

నందమూరి బాలకృష్ణ  హోస్ట్ గా చేసిన ‘అన్ స్టాప‌బుల్‘ టాక్ షో  సూప‌ర్ స‌క్సెస్ సాధించిన విషయం తెలిసిందే.  అప్ప‌టి వ‌ర‌కు సినిమాల‌కే ప‌రిమితమైన బాల‌య్య తొలిసారి టాక్ షో చేయ‌డం.. ఎంట‌ర్ టైనింగ్ గా ఆ షోను ర‌న్ చేయ‌డంతో మంచి ఆదరణ లభించింది. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు స్పెషల్ గెస్టులుగా విచ్చేసి తమ లైఫ్, కెరీర్ గురించి పలు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఆడియన్స్ తో పంచుకునేవారు.

ఇక హోస్ట్ గా బాలయ్య తనదైన‌ మార్క్ తో సరదా పంచ్ డైలాగ్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ఈ షోకి బాగా రెస్పాన్స్ రావడంతో పాటు వ్యూస్ కూడా విపరీతంగా లభించాయి. దీంతో ఈ క్రేజీ షో సెకండ్ సీజన్ కోసం ఆడియన్స్ అందరూ ఎప్పటి నుంచో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కాగా వారందరి ఎదురుచూపులు అతి త్వరలోనే ఫుల్ స్టాప్ ప‌డ‌నుంది.

లేటెస్ట్ గా ఆహా వారు అన్ స్టాప‌బుల్ సెకండ్ సీజ‌న్ గురించి ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. అతి త్వరలోనేసీజన్ 2 ప్రసారం కాబోతున్నట్లు తెలియ‌చేశారు. ఫస్ట్ సీజన్ ని మించి మరింత అద్భుతంగా సీజన్ 2 ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సీజన్ 2 లో ఎవరెవరు గెస్టులుగా రానున్నారో తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Also Read: బాల‌య్య షోలో మెగాస్టార్. అభిమానుల‌కు పండ‌గే

RELATED ARTICLES

Most Popular

న్యూస్