విక్టరీ వెంకటేష్ తమిళ క్లాసిక్ అసురన్ మూవీకి రీమేక్ గా నారప్ప సినిమా చేశారు. ఈ సినిమాకి సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. సురేష్ బాబు ఈ సినిమాని నిర్మించారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారు. అయితే.. ఈ మాస్ మూవీకి క్లాస్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు అని ప్రకటించినప్పుడు ఈ కథకు న్యాయం చేయలేడు.. రాంగ్ ఛాయిస్ అనుకున్నారు కానీ… శ్రీకాంత్ అడ్డాల తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. నారప్ప సినిమాను పర్ ఫెక్ట్ అనేలా తెరకెక్కించారు.
అయితే.. ఈ సినిమా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీ బాట పట్టింది. తెలుగు నేటివిటీ తగ్గట్టు కొన్ని మార్పులు చేసిన తీసిన ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. ధనుష్ యాక్టింగ్ తో కొన్ని పోలికలు వచ్చినా మొత్తానికి వెంకటేష్ తన అనుభవంతో కథకు న్యాయం చేశారనే ప్రసంశలు అందుకున్నారు. ఇప్పుడీ సినిమా థియేటర్స్ లో విడుదల అవుతుంది. వెంకటేష్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్13న నారప్ప చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. పాత చిత్రాలను కొత్తగా రిలీజ్ చేయడమనే ట్రెండ్ నడుస్తుంది.
నారప్ప చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేసినప్పుడు అభిమానులు చాలా ఫీలయ్యారు. థియేటర్లో రిలీజ్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ట్రెండింగ్ లో నిలిచారు. అయితే.. ఇప్పుడు నారప్ప చిత్రాన్ని థియేటర్లో రిలీజ్ చేస్తుండడంతో వెంకీ అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఓటీటీలో రిలీజైన సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో నారప్ప థియేటర్ల రిలీజ్ ఆసక్తిగా మారింది. మరి.. నారప్ప థియేటర్లో ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి