Saturday, January 18, 2025
HomeసినిమాKhushi: రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకెళుతున్న'ఖుషి'

Khushi: రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకెళుతున్న’ఖుషి’

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ జోరు కొనసాగిస్తోంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరినీ  ఆకట్టుకుంటోంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 30.1 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా రెండో రోజుకు 51 కోట్ల రూపాయలు ఆర్జించింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ దక్కుతున్నాయి. నైజాం ఏరియాలో రెండో రోజున ఖుషి 3.3 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుంది. మూడో రోజు ఆదివారం కూడా ఈ జోరు కొనసాగింది.

మరో వైపు యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఖుషి జోరు కనిపిస్తోంది. రెండో రోజునే ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద వన్ మిలియన్ డాలర్స్ ఫీట్ సాధించింది. కలెక్షన్స్ చూస్తుంటే.. మరికొద్ది రోజుల పాటు ఖుషి జోరు కొనసాగేలా ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్