Sunday, January 19, 2025
Homeసినిమాఆ ఫైట్ సీన్ పూనకాలు తెప్పిస్తుంది: కిరణ్ అబ్బవరం 

ఆ ఫైట్ సీన్ పూనకాలు తెప్పిస్తుంది: కిరణ్ అబ్బవరం 

కిరణ్ అబ్బవరం వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఇంతకుముందు చేసిన రెండు మూడు సినిమాలు ఆశించిన స్థాయిని అందుకోలేకపోయినా, ఈ సారి మాత్రం హిట్ ఖాయమంటూ రంగంలోకి  దిగేశాడు. గీతా ఆర్ట్స్ 2లో ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాలో చేశాడు. బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకి నంద కిశోర్ దర్శకత్వం వహించాడు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 18వ తేదీన విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్నరాత్రి ‘తిరుపతి’లో జరిగింది. ఈవెంటులో బన్నీవాసు మాట్లాడుతూ .. ఈ సినిమా డైరెక్టర్ తిరుపతికి చెందిన కుర్రాడనీ .. హీరో కిరణ్ అబ్బవరానికి కూడా తిరుపతితో మంచి అనుబంధం ఉందని అన్నాడు. ఈ మధ్య ఇండస్ట్రీలో తిరుపతి నుంచి వచ్చేవారి సంఖ్య పెరిగిపోతుందని చెప్పాడు. తనకి ఇంతటి మంచి భవిష్యత్తును ఇచ్చింది ఆ స్వామియేననీ, ఈ సినిమా తమ బ్యానర్ కి మంచి తీసుకుని వస్తుందనే నమ్మకం ఉందని అన్నాడు.

ఇక కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ .. తాను తిరుపతిలో చాలా కాలం పాటు చదువుకున్నాననీ, అందువలన తనకి తిరుపతితో మంచి అనుబంధం ఉందని అన్నాడు. తిరుపతి చుట్టూ తిరిగే ఈ కథలో తిరుపతి పై ఒక పాట కూడా ఉందనీ, ఈ పాట తిరుపతి ప్రజలకు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పాడు. ఈ సినిమాలో ‘గోవిందరాజస్వామి’ ఆలయం దగ్గర జరిగే ఫైట్ సీన్ చాలా బాగా వచ్చిందనీ. ఖచ్చితంగా అది ఆడియన్స్ కి పూనకాలు తెప్పించే సీన్ అవ్వుతుందని అన్నాడు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ ఇస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

Also Read : గీత ఆర్ట్స్ లో గుర్తుండిపోయే సినిమా – కిరణ్ అబ్బవరం

RELATED ARTICLES

Most Popular

న్యూస్