Saturday, July 27, 2024
HomeTrending Newsతక్షణమే వరద సాయం అందించండి: వైసీపీ ఎంపీలు

తక్షణమే వరద సాయం అందించండి: వైసీపీ ఎంపీలు

Relief: గోదావరికి కనివీనీ ఎరుగని రీతిలో సంభవించిన వరదలతో  పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం వాటిల్లినందున తక్షణమే సాయం చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డి, పార్టీ లోక్‌ సభ ఫ్లోర్‌ లీడర్‌ పీ.వి.మిధున్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆదివారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న వారు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అఖిలపక్ష సమావేశంలో కేంద్రం దృష్టికి తీసుకువచ్చిన తమ డిమాండ్ల గురించి విజయసాయి వివరించారు. ఆకస్మిక వరదల కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతంలోగల  జిల్లాల్లో ఆస్తి, పంట నష్టం వాటిల్లిందని, వందలాది గ్రామాలు నీట మునిగాయని, వరద బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున సహాయ, పునరావాస చర్యలు చేపట్టినట్లు సమావేశంలో కేంద్రం దృష్టికి తీసుకువచ్చామని చెప్పారు.

  • రాష్ట్రాలకు ఇచ్చే జీఎస్టీ నష్టపరిహారం మరో అయిదేళ్ళపాటు పొడిగించాలని
  • ఏపీ పునర్విభజన చట్టంపై కేంద్రం ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన చేయాలని
  • పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి నిధుల విడుదలలో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని నివారించాలని
  • విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటులో జరుగుతోన్న ఆలస్యం
  • అమెరికన్‌ డాలర్‌తో రూపాయి మారకం విలువ విపరీతంగా పడిపోవడంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని
  • రాష్ట్రంలోని ప్రధాన ప్రాజక్టులైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులకు అనుమతులు మంజూరు
  • రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 26 జిల్లాలలో జిల్లాకో మెడికల్ కాలేజీ, జిల్లా ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి అనమతించాలని
  • జనాభా లెక్కల సేకరణ ప్రారంభించాలని,
  • పార్లమెంట్‌లో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని… అఖిల పక్ష సమావేశంలో కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు వివరించారు.

అన్ పార్లమెంటరీ పదాలు జాబితాను లోక్‌ సభ కార్యాలయం అన్ని రాష్ట్రాలకు పంపిందని ఒకప్రశ్నకు బదులిస్తూ చెప్పారు. 1954 నుండి ఇది ఆనవాయితీగా వస్తున్నదేనని, సమావేశాలు ప్రారంభానికి ముందు ఆయా రాష్ట్రాలకు లోక్ సభ స్పీకర్ ఆ జాబితా పంపడం జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అఖిలపక్ష సమావేశంలో చెప్పినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా పార్లమెంట్ ప్రాంగణంలో నిరసనలు, ధర్నాలపై ఆంక్షలు విధిస్తూ వచ్చిన ఆదేశాలపై  అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఇది కూడా ఆనవాయితీగా వస్తున్నదేనని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్