Sunday, January 19, 2025
HomeTrending Newsఅయినా... నాకు బాధ లేదు: చంద్రబాబు

అయినా… నాకు బాధ లేదు: చంద్రబాబు

ISB-Babu: ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ హైదరాబాద్ (ఐ ఎస్ బి)కు రావడంలో తన కృషి ఎంతగానో ఉందని ఏపీ ప్రతిపక్షనేత, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ లో ఈ సంస్థ ఏర్పాటు అసలు పరిగణన లేకపోయినా  సంబధిత అధికారులను బ్రేక్ ఫాస్ట్ కు ఆహ్వానించి వారిని ఒప్పించగలిగానని గుర్తు చేసుకున్నారు.  20 ఏళ్ళ క్రితం నాటి ప్రధాని వాజ్ పేయి, తాను కలిసి ఈ అత్యున్నత సంస్థకు శ్రీకారం చుట్టామన్నారు. మహారాష్ట్రలోనో, బెంగులూరులోనో, తమిలనాడులోనో పెట్టాలని అనుకున్న ఈ సంస్థను హైదరాబాద్ తీసుకు వచ్చేలా ఎంతో కృషి చేశానన్నారు.

తెలుగుదేశం పార్టీ మహానాడు-2022 ఒంగోలులో ఘనంగా ప్రారంభమైంది.  ఈ సందర్భంగా చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. నిన్న ఐ ఎస్ బి 20వ వార్షికోత్సవం సందర్భంగా నాటి సంగతులను చంద్రబాబు మరోసారి  పార్టీ శ్రేణులకు వివరించారు. అధికారులు బ్రేక్ ఫాస్ట్ కు వచ్చినప్పుడు తానే  వారికి స్వయంగా తానే ప్లేట్లు అందించి వారికి అల్పాహారం వడ్డించానని చెప్పారు.

నిన్న 20వ వార్షికోత్సవం సందర్భంగా  ఈ సంస్థపై ఎన్నో ప్రత్యేక కథనాలు, వార్తలు వచ్చాయని, తనకూ నాటి విషయాలు జ్ఞాపకానికి వచ్చాయన్నారు. తెలుగు జాతి కోసం తాను తపన పడ్డానని, తనకున్న పట్టుదలకు ఇది నిదర్శనమని బాబు వివరించారు. నిన్నటి సభలో తన పేరు ప్రస్తావించకపోయినా, తన కృషి గుర్తించకపోయినా తాను బాధపడడం లేదని, నా జాతికోసం నేను చేశానని భావోద్వేగంగా బాబు వ్యాఖ్యానించారు.

Also Read : త్యాగాలకు సిద్ధం కావాలి : నరేంద్ర 

RELATED ARTICLES

Most Popular

న్యూస్