Sunday, May 26, 2024
HomeTrending Newsవైసీపీ పనైపోయింది: బాబు

వైసీపీ పనైపోయింది: బాబు

పుంగనూరులో టిడిపి కార్యకర్తల అరెస్టు అమానుషమని, ఇంతకంటే టెర్రరిస్టు చర్య ఏమి ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.  రొంపిచర్లలో ఎనిమిదిమందిని అక్రమంగా జైల్లో నిర్భందించారని, వీరిలో ఏడుగురు మైనార్టీలు, ఒక అయ్యప్ప భక్తుడు ఉన్నాడని, వీరంతా యువకులేనని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.  వీరిని అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెట్టారని, ఆ తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారని, జడ్జికి కొట్టినట్లు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని వారిని భయపెట్టారని అన్నారు.  పీలేరు సబ్ జైలులో రిమాండ్ లో ఉన్న టిడిపి కార్యలను చంద్రబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

తమ పార్టీ కార్యకర్తలను వేధించిన సిఐ, ఇతర పోలీసు అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బాబు హెచ్చరించారు.  పోలీసులు శాంతి భద్రతలను కాపాడాలని, అందరినీ సమానంగా చూడాలని సూచించారు. చట్టానికి కొంతమంది చుట్టాలు కాదని, అలా ఎవరైనా ప్రవర్తిస్తే ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.  టిడిపి ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను చించివేసి పైగా తమ పార్టీ  కార్యకర్తలపైనే దాడులు చేశారని, ఈ దాడుల్లో కొందరు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.  అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నిస్తే దాడులు, దౌర్జన్యాలు చేసి కేసులు పెట్టడం పరిపాటిగా మారిందని, తమ పార్టీ వారిని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.  ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగితే అన్నమయ్య జిల్లా    పీలేరు జైల్లో పెట్టారని అన్నారు. పోలీసులు అసభ్య పదజాలంతో, అమ్మా, అక్క అంటూ తిట్టారని రొంపిచర్ల ఎస్ఐ, కల్లూరు సిఐలు ఎలా తప్పించుకుంటారో చూస్తా అని వార్నింగ్ ఇచ్చారు.    ఏపీలో మైనార్టీలకు మనుగడ లేకుండా పోయిందని, ప్రశ్నిస్తే చంపేస్తున్నారని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి పని, అయన పార్టీ పని అయిపోయిందని బాబు వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్