Sunday, January 19, 2025
Homeసినిమా బాల‌య్య 107 టీజ‌ర్ రిలీజ్.

 బాల‌య్య 107 టీజ‌ర్ రిలీజ్.

Balayya roar:  నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ మ‌లినేని గోపీచంద్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఇందులో బాల‌య్య స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తోంది. అయితే.. బాల‌య్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు.

ఇక టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే.. గతంలో మాదిరిగానే సింహాన్ని బాలకృష్ణకి సింబాలిక్ గా చూపిస్తూనే.. మలుపులతో కూడిన దారి.. కార్ల వరసలు.. బాలయ్య మార్కు యాక్షన్ ను ఆవిష్కరించారు. మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్.. భయం నా బయోడేటాలోనే లేదురా .. వంటి డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. బాలయ్య లుక్ కొత్తగా బాగుంది. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ మూవీ టైటిల్ ప్ర‌క‌టించ‌నున్నార‌ని స‌మాచారం. ఇక ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్