Saturday, January 18, 2025
HomeTrending Newsఎన్నికల కోసమే బిజెపి డ్రామాలు : మంత్రి జగదీష్‌ ఫైర్

ఎన్నికల కోసమే బిజెపి డ్రామాలు : మంత్రి జగదీష్‌ ఫైర్

తెలంగాణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం క్షుద్ర రాజకీయం చేస్తుంది. ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేపడుతున్నదని మంత్రి జగదీష్‌ రెడ్డి బీజేపీపై నిప్పులు చెరిగారు. గురువారం ఆయన సూర్యపేట క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణ పై విషం కక్కిన ప్రధాని మోదీ ఇయ్యాల బిడ్డ బర్త్‌డే చేయడంలో ఆంతర్యం ఏంటని సూటిగా ప్రశ్నించారు. ఇన్నాళ్లకు బీజేపీకి తెలంగాణ ఆవిర్భావ దినం గుర్తుకు రావడం తెలంగాణ ప్రజలకు ఆశ్చర్య కలిగిస్తుందన్నారు. తెలంగాణ పై నిత్యం విషం కక్కుతున్న మోదీ మంత్రి వర్గంలోని కీలక మంత్రి అమిత్ షా ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనడాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.

విభజన హామీలు నెరవేర్చడంలో విఫలమైన బీజేపీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరపడం ఒక డ్రామా అని మండిపడ్డారు. జాతీయ సమావేశాల్లో తెలంగాణకు ఎం చేసిందో స్పష్టం చెయ్యాలి. హైదరాబాద్ లో 24 గంటలు కరెంటు, పుష్కలంగా నీళ్లు ఉండటం వల్లనే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇక్కడ నిర్వహిస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.

సమావేశాలకు వచ్చిన బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ఇక్కడ అభివృద్ధిని చూసి నేర్చుకొని పొతే మంచిదని హితవు పలికారు. ఎనిమిదేండ్ల క్రితం తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు గుజరాత్ లో ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ ఢిల్లీ కి వస్తున్నాడానే బీజేపీ అగ్ర నాయకత్వం మొత్తం ఉలిక్కిపడి హైదరాబాద్ వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Also Read : తెలంగాణలో పాగా వేసేందుకు బిజెపి ప్రణాళికలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్