Sunday, January 19, 2025
Homeసినిమాలాల్ సింగ్ చ‌డ్డా.. నాగార్జున రివ్యూ

లాల్ సింగ్ చ‌డ్డా.. నాగార్జున రివ్యూ

అమీర్ ఖాన్, క‌రీనా క‌పూర్ జంట‌గా న‌టించిన చిత్రం ‘లాల్ సింగ్ చ‌డ్డా’. ఈ మూవీలో అక్కినేని నాగ‌చైత‌న్య కీల‌క పాత్ర పోషించ‌డం విశేషం. దాదాపుగా నాగ‌చైత‌న్య పాత్ర అర గంట సేపు ఉండ‌డంతో అక్కినేని అభిమానులు ఈ మూవీ కోసం ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆగ‌ష్టు 11న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం విశేషం.

ఇదిలా ఉంటే.. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్ర‌మోష‌న్స్ లో స్పీడు పెంచారు మేక‌ర్స్. ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్ AMB సినిమాస్‌లో ప్రత్యేక ప్రీమియర్‌ కి ప్రముఖ సెలబ్రిటీలు హాజరయ్యారు. అందులో నాగార్జున కూడా ఒకరు. లాల్ సింగ్ చ‌డ్డా మూవీని చూసిన నాగార్జున ఈ మూవీ గురించి రివ్యూ ఇచ్చేశారు. నాగార్జున ఏమ‌న్నారంటే.. “లాల్ సింగ్ చద్దా ప్రతి ఒక్కరినీ లోపలి నుండి కదిలిస్తుందని మరియు ప్రేమ మరియు అమాయకత్వం అందరినీ జయించాలనే సాధారణ సందేశంతో వస్తుంది” అని వెల్లడించారు.

‘ఈ చిత్రం మనల్ని ఒకేసారి నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది.. ఆలోచించేలా చేస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు. నాగ చైతన్య నటుడిగా ఎదగడం చాలా అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. లాల్ సింగ్ చ‌డ్డాకు చాలా పాజిటివ్ టాక్ ఉంది. మ‌రి.. ఈ మూవీ ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో.. నాగ‌చైత‌న్య‌కు ఎలాంటి పేరును తీసుకువ‌స్తుందో చూడాలి.

Also Read : టాలీవుడ్ స్టార్స్ కి అమీర్ ఖాన్ స్పెష‌ల్ షో

RELATED ARTICLES

Most Popular

న్యూస్