విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన ‘లైగర్‘ డిజాస్టర్ గా నిలిచినా సంగతి తెలిసిందే. విజయ్, పూరీలతో పాటు ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లో పాతుకు పోవచ్చన్న హీరోయిన్ అనన్య పాండే ఆశలు అడియాశలయ్యాయి.
విజయ్, పూరి కాంబినేషన్లో మొదలైన ‘జనగణమన’ డౌట్ లో పడింది. ఇదిలా ఉంటే.. విజయ్ మరియు విజయ్ ఫాదర్ టెన్షన్ ఫీలవుతున్నారట. ‘గత చిత్రాలతో మంచి క్రేజ్ వచ్చింది…. ఇలాంటి టైమ్ లో లైగర్ సక్సస్ అయ్యుంటే బాగుండేది. పూరీ జగన్ ఇలా చేస్తాడనుకోలేదు’ అంటూ బాగా ఫీలవుతున్నారని సమాచారం. మీడియాలోని కొంత మందిని పిలిచి లోపం ఎక్కడ జరిగింది? విజయ్ ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది? అని తెలుసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇక నుంచి కథ పై చాలా కేర్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. కథ ఫైనల్ చేసే ముందుకు కొంత మంది అనుభవం ఉన్న మీడియా వాళ్ల సలహాలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. మొత్తానికి లైగర్ విజయ్ కి బిగ్ షాక్ ఇచ్చింది. దీనిని నుంచి త్వరగా బయటపడేందుకే ఖుషి షూటింగ్ స్టార్ట్ చేశారట. మరి.. విజయ్ ఆశించిన సక్సెస్ ఎప్పుడు వస్తుందో?
Also Read : కసితో బయల్దేరి .. చివర్లో దారి తప్పిన ‘లైగర్’